Breaking News

ఎవరు చెప్పినా వినండి.. కానీ..

Published on Mon, 07/14/2025 - 15:04

డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్‌ ఇదే..

ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు.

Videos

పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు

భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన

ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు

శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి

YS Jagan Tweet: శభాష్ శుభాంశు..

Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..

ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం

ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు

Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

Photos

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)