Kota Srinivasa Rao: వైఎస్ జగన్ సంతాపం
Breaking News
పదికాలాలపాటు పచ్చగా అనంత్-రాధికల వివాహం
Published on Sat, 07/12/2025 - 11:07
పెళ్లిచేస్తే పదికాలాలపాటు అందరూ మాట్లాడుకునేలా ఉండాలని బహుశా రిలయన్ అధినేత ముఖేశ్-నీతా అంబానీ అనుకున్నారేమో.. వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల వివాహం జరిగి ఏడాది అవుతున్నా ప్రపంచంలో ఎక్కడోమూల దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ వివాహంలోని ఏర్పాట్లు, అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, పంచభక్ష పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు..ఇలా కొన్నేమిటి ఎన్నో విషయాల గురించి ముచ్చటిస్తున్నారు. ఈ రోజు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా..
ముఖేష్ అంబానీ– నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌తో జులై 12, 2024న అంగరంగ వైభవంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో జరిపించారు. ఈ వేడుకలకు దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. తర్వాతి రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక. ఆ మరుసటి రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

పెళ్లికి ముందు రెండుసార్లు ఈ జంట అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండోసారి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతకుముందు ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.
ఇదీ చదవండి: ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!
వివాహానికి హాజరైన ప్రముఖుల్లో కొందరు..
వైదిక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రికెటర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఇలా ఎన్నో విభాగాలకు చెందిన అగ్రజులు హాజరయ్యారు.
ఆధ్యాత్మిక గురువులు..
స్వామి సదానంద సరస్వతి, శంకరాచార్య, ద్వారకా
స్వామి అవిముక్తేశ్వర, సరస్వతి, శంకరాచార్య, జోషిమఠ్
గౌరంగ్ దాస్ ప్రభు, డివిజనల్ డైరెక్టర్, ఇస్కాన్
గుర్ గోపాల్ దాస్, మాంక్, ఇస్కాన్
రాధానాథ్ స్వామి, ఇస్కాన్ పాలకమండలి సభ్యుడు
రమేష్ భాయ్ ఓజా
గౌతమ్ భాయ్ ఓజా
దేవప్రసాద్ మహరాజ్
విజుబెన్ రజని, శ్రీ ఆనందబావ సేవా సంస్థ
శ్రీ బాలక్ యోగేశ్వర్ దాస్ జీ మహరాజ్, బద్రీనాథ్ ధామ్
చిదానంద్ సరస్వతి, పర్మార్త్ నికేతన్ ఆశ్రమం
శ్రీ నమ్రముని మహరాజ్, జైన్ ముని, ప్రసాదం వ్యవస్థాపకులు
ధీరేంద్ర కుమార్ గార్గ్, గురు, బాగేశ్వర్ ధామ్
బాబా రాందేవ్, యోగా గురువు తదితరులు.
వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు
జాన్ కెర్రీ (అమెరికా పొలిటీషియన్)
టోనీ బ్లెయిర్ (మాజీ ప్రధాని, యూకే)
బోరిస్ జాన్సన్ (బ్రిటన్ మాజీ ప్రధాని)
మాటియో రెంజీ (ఇటలీ మాజీ ప్రధాని)
సెబాస్టియన్ కుర్జ్ (ఆస్ట్రియా మాజీ ప్రధాని)
స్టీఫెన్ హార్పర్, కెనడా మాజీ ప్రధాని
కార్ల్ బిల్డ్ (స్వీడన్ మాజీ ప్రధాని)
మహ్మద్ నషీద్ (మాల్దీవుల మాజీ అధ్యక్షుడు)
సామియా సులుహు హసన్ (అధ్యక్షుడు, టాంజానియా) తదితరులు.

గ్లోబల్ బిజినెస్ లీడర్లు
అమీన్ నాజర్ (ప్రెసిడెంట్ & సీఈఓ, ఆరామ్‌కో)
హెచ్.ఇ. ఖల్దూన్ అల్ ముబారక్, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్, ముబదాలా
ముర్రే ఆచింక్లోస్ (సీఈఓ, బీపీ)
రాబర్ట్ డడ్లీ (మాజీ సీఈఓ - బీపీ, బోర్డు మెంబర్ - ఆరామ్‌కో)
మార్క్ టక్కర్ (హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ)
బెర్నార్డ్ లూనీ (మాజీ సీఈఓ, బీపీ)
శంతను నారాయణ్ (సీఈఓ, అడోబ్)
మైఖేల్ గ్రిమ్స్ (మేనేజింగ్ డైరెక్టర్, మోర్గాన్ స్టాన్లీ)
ఇగోర్ సెచిన్, సీఈఓ, రోస్ నెఫ్ట్
జే లీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
దిల్హాన్ పిళ్లై (టెమాసెక్ హోల్డింగ్స్ సీఈఓ) తదితరులు.

Tags : 1