Breaking News

ఛి…ఛీ.. అంటూ 'పవన్‌'పై ప్రకాష్ రాజ్ ఫైర్‌.. లక్షల్లో ట్వీట్లు

Published on Sat, 07/12/2025 - 09:15

'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్అనే నినాదాన్ని ఇచ్చిన పవన్ఇప్పుడు 'ఏ మేరా జహా' అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా అందరి నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోంది. #POLITICALJOKERPK అనే హ్యాష్ట్యాగ్సోషల్మీడియాలో ట్రెండ్అవుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్‌కు కౌంటర్‌గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. తాజాగా ప్రముఖ సినీ నటులు ప్రకాశ్రాజ్కూడా స్పందించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్రాజ్మండిపడ్డారు. తన ఎక్స్పేజీలో పవన్చేసిన కామెంట్స్ను చేర్చి 'range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking' అంటూ ఆయన ఫైర్అయ్యారు. దీంతో ప్రకాశ్రాజ్కు కూడా చాలామంది సపోర్ట్గా ఆయన చేసిన పోస్ట్ను షేర్చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ బాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్లు, మాట్లాడిన మాటలను వైరల్చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్అని పిలుపునిచ్చిన పవన్ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్చేస్తున్నారు.హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై ప్రకాశ్ రాజ్ సెటైరికల్ పోస్ట్

హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?
1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్‌ భయపడి నట్టే ఇప్పుడు జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్‌ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది. అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ విశ్లేషకులు కోరుతున్నారు.

Videos

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. స్టంట్ చేస్తుండగా మాస్టర్ మృతి

టీడీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత

సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత

జగన్ ను ఫాలో అవ్వండి.. కడపలో కూటమి ఫ్లెక్సీ.. వినుత డ్రైవర్ కేసులో బిగ్ ట్విస్ట్

భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త

వీళ్ల కష్టం సూస్తున్నర పవన్ కల్యాన్‌ సారూ!

భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు

వీడియోలు వేసి మరీ.. చంద్రబాబుపై పేర్ని కిట్టు మాస్ ర్యాగింగ్

Ujjaini Mahankali Temple: రంగం భవిష్యవాణి 2025

వినుత వీడియోలతో వ్యాపారం.. జనసేన ఆఫీసులో ప్రత్యక్షం!

Photos

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)