బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్
Breaking News
క్విక్ కామర్స్‌లో పోటాపోటీ
Published on Sat, 07/12/2025 - 04:25
న్యూఢిల్లీ: దేశీ క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆధిపత్యం నడుస్తుండగా తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నౌ కూడా రంగంలోకి దిగింది. అమెజాన్ నౌ పేరిట బెంగళూరు తర్వాత ఢిల్లీలో కూడా నిర్దిష్ట పిన్‌కోడ్‌లలో 10 మినిట్స్ డెలివరీ సర్వీసులు ప్రారంభించింది.
ఆయా పిన్–కోడ్‌లలోని యూజర్లకు యాప్‌లో ఇప్పుడు అమెజాన్ నౌ అనే ట్యాబ్‌ను అందుబాటులోకి తెచి్చంది. నిత్యావసరాలు, పండ్లు..కూరగాయలు, పర్సనల్ కేర్, సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, వైర్‌లెస్ యాక్సెసరీలు, చిన్న గృహోపకరణాలు మొదలైన వాటిని ఈ సర్వీస్ కింద అమెజాన్ అందిస్తోంది. డెలివరీ ఉచితంగా పొందాలంటే ప్రైమ్ యూజర్లకు కనీస కొనుగోలు విలువ రూ. 99గా, నాన్–ప్రైమ్ యూజర్లకు రూ. 199గా ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ల దన్ను..: డేటా చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడం, యువ జనాభా ఎక్కువగా ఉండటం వంటి అంశాలు దేశీయంగా క్విక్ కామర్స్‌కి దన్నుగా ఉంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బెయిన్ అండ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ఈ–గాస్రరీ ఆర్డర్లలో మూడింట రెండొంతుల వాటా, ఈ–రిటైల్ వ్యయాల్లో పదో వంతు వాటా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలదే ఉంది. దేశీయంగా కొనుగోళ్ల విధానాల్లో క్యూకామ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న తీరును ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. కొనుగోళ్లకు సంబంధించి ఇది దాదాపు ప్రధాన మాధ్యమంగా మారిపోతుండటంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లాంటి సంస్థలు కూడా తప్పనిసరిగా రంగంలోకి దిగుతున్నాయి.
రూ. 64,000 కోట్ల ఆర్డర్లు..
2024–25లో భారతీయులు బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లాంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా రూ. 64,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులకు ఆర్డరిచి్చనట్లు అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 30,000 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) రూ. 2 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ కెర్‌ఎడ్జ్ రేటింగ్స్ విభాగం ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి ఏకంగా 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ మరో రిపోర్టులో
అంచనా వేసింది.
Tags : 1