Breaking News

మొన్న శృతిహాసన్.. నేడు మార్కో హీరో.. సోషల్ మీడియా హ్యాక్!

Published on Tue, 07/08/2025 - 15:28

ఇటీవల ఎక్కువగా సినీతారల సోషల్ మీడియా ఖాతాలే టార్గెట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శృతిహాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంభందించిన లింక్స్ దర్శనమిచ్చాయి. అయితే తాజాగా మరో హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులను హెచ్చరించారు. ఏదైనా సందేశాలు వస్తే వాటికి రెస్పాండ్ కావొద్దని ఫ్యాన్స్‌కు సూచించారు. ప్రస్తుతం దీనిపై తన టీమ్‌ సభ్యులు పని చేస్తున్నారని.. అకౌంట్ రికవరీ అయ్యాక తానే అప్‌డేట్ ఇస్తానని అభిమానులకు అలర్ట్ చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.

మలయాళ స్టార్‌ ఉన్ని ముకుందన్‌ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్‌ వయొలెంట్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే మార్కో చిత్రంలో వయొలెన్స్‌ విపరీతంగా ఉందని కొందరు విమర్శలు కూడా చేశారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా కూడా ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ అలాంటిదేం లేదని ఇటీవలే కొట్టపారేశారు. 
 

Videos

రప్పా రప్పా వ్యాఖ్యలపై పేర్ని నాని క్లారిటీ

ఏం యాక్టింగ్ గురు.. కోట సినీ బయోగ్రఫీ

ఏం నేరం చేశారని ఉప్పాల హారికపై గుడివాడలో దాడులు చేయించారు? : వైఎస్ జగన్

కోటన్నా అంటూ.. కంటతడి పెట్టిన బాబు మోహన్

కోట శ్రీనివాసరావు చివరి వీడియో

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సమన్లు జారీ చేసిన హిందూపురం కోర్టు

Kota Srinivasa Rao: వైఎస్ జగన్‌ సంతాపం

తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచిన కోటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది: వినుత భర్త చంద్రబాబు

గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు

Photos

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అమెరికా స్వాతంత్ర్య దిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

‘యువి కెన్‌’ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన భార‌త ప్లేయ‌ర్లు (ఫోటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో వరుణ్‌తేజ్‌.. చాయ్‌ తాగుతూ (ఫోటోలు)