గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు
Breaking News
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Mon, 07/07/2025 - 15:43
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్‌లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి.
Tags : 1