Breaking News

పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’

Published on Wed, 07/02/2025 - 17:55

పుట్టకతోనే చెవిటివారా లేదా చెవిలో మిషన్‌ పెట్టనిదే బయట శబ్దాలు వినిపించట్లేదా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పుట్టకతోనే ఎవరైనా పూర్తిగా చెవిటివారుగా ఉన్న సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్‌ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్‌లోని ఒక పోస్ట్‌కు ప్రతిస్పందనగా మస్క్‌ ఈమేరకు వివరాలు వెల్లడించారు.

కెర్నల్‌ కంపెనీ సీఈఓ బ్రెయిన్‌ జాన్సన్‌ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్‌ పెడుతూ..‘మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30–40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్‌ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.

దీనికి ప్రతిస్పందనగా మస్క్‌..‘వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్‌ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్‌ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్‌ చేస్తుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ‘యాపిల్‌ రహస్యాలు దొంగతనం’

ఇదిలాఉండగా, ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్  పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్‌ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్‌ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది.

#

Tags : 1

Videos

ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప

ఆ రోజే మరోసారి కరోనా ప్రళయం.. జపాన్ బాబా మరో సంచలనం

చనిపోయిన వారిని కూడా బదిలీ చేసిన సర్కారు

రోడ్లపై యువకుల హంగామా

పబ్లిసిటీ పీక్ ... పెర్ఫార్మెన్స్ పీక్

కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం

తల్లికి వందనం వేస్తారా లేదా? విద్యుత్ పోలెక్కి నిరసన

బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి

మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు YS జగన్ సందేశం

కూటమి ప్రభుత్వంలో గిరిజనుల అవస్థలు గుండెల్ని పిండేసే వీడియో

Photos

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)