Breaking News

‘సూపర్‌ యాప్‌’లో అన్ని రైల్వే సేవలు

Published on Tue, 07/01/2025 - 18:43

భారతీయ రైల్వే ‘రైల్‌ వన్‌(Railone)’ పేరుతో సూపర్‌యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. గత ఏడాదే వెల్లడించినట్లుగానే ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్.. వంటి ఎన్నో సర్వీసులను పొందవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.. అందులో ఏయే సర్వీసులున్నాయో కింద తెలుసుకుందాం.

ఈ యాప్‌లో అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో, విభిన్న యాప్‌ల ద్వారా వేర్వేరుగా ఉన్నాయి. తాజాగా వాటన్నింటినీ ఒకే యాప్‌ పరిధిలోకి తీసుకొచ్చేలా కొత్త యాప్‌ను ప్రారంభించారు. దీన్ని ఐఆర్‌సీటీసీ ‘సూపర్‌ యాప్‌’గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌ను కొన్ని రోజులుగా వివిధ దశల్లో రైల్వేశాఖ పరీక్షించింది. ఈ యాప్‌ను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఐఎస్‌) అభివృద్ధి చేసింది.

ఇన్‌స్టాల్‌ చేసుకోండిలా..

  • గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.

  • యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.

  • యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.

  • కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.

  • సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.

  • మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.

  • ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.

ఇదీ చదవండి: ‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’

రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలు

  • టికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

  • ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.

  • రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.

  • ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.

  • రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Videos

తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు

మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ..!

ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై

వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ

రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

Photos

+5

చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్‌ బీచ్‌లు ఇవే...

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)