Breaking News

‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’

Published on Tue, 07/01/2025 - 18:07

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్‌బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.

ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్‌ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.

ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపర

ఇతర కంపెనీల తీరిది..

సేల్స్‌ఫోర్స్‌ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్‌లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది.

Videos

తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు

మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌ ..!

ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై

వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్

జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల

సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన సింగయ్య ఫ్యామిలీ

రేవంత్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

Photos

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)