తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు
Breaking News
అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదల
Published on Tue, 07/01/2025 - 16:08
ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంలో 759 బిలియన్ డాలర్ల సంపదతో 123 మంది బిలియనీర్లు టాప్‌లో ఉన్నారు. 2021లో బీజింగ్ ఆధిక్యం సాధించడం మినహా గత 12 ఏళ్లుగా న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంటోంది. ఈ శత కోటీశ్వరుల్లో ఎక్కువ మంది ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో సేవలందిస్తున్నారు.
నివేదికలోని వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3,028 మంది బిలియనీర్లలో నాలుగో వంతు మంది ఆరు దేశాల్లోని కేవలం 10 నగరాల్లోనే నివసిస్తున్నారు. మెరుగైన బిజినెస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఈ నగరాలు సంపదను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
భారత్‌లో ముంబయి..
మొత్తం మీద అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న టాప్ దేశాల్లో భారత్ లేనప్పటికీ, ముంబయి ఈ కేటగిరీలో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 349 బిలియన్ డాలర్ల సంపద కలిగిన 67 మంది బిలియనీర్లతో ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన మెట్రో నగరాల కంటే అత్యంత సంపన్నులు కలిగిన భారతీయ నగరంగా నిలిచింది. అయితే ఈ ఏడాది ముంబయి స్థానం నాలుగు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. ఇద్దరు బిలియనీర్లు ఇందులో నుంచి నిష్క్రమించడమే ఇందుకు కారణం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ముంబయి, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. 2025లో ముంబైలో కొత్తగా ఆరుగురు బిలియనీర్లు చేరారు. వీరిలో నలుగురు దోషి కుటుంబానికి చెందినవారున్నారు. వీరేన్, కిరీట్, పంకజ్, హితేష్ దోషి వారి కంపెనీ ‘వారీ ఇండస్ట్రీస్’ గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. దాంతో సంపద అమాంతం పెరిగిపోయింది.
ఇదీ చదవండి: భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా?

Tags : 1