Breaking News

వెనక్కి తగ్గని కమల్..సారీ చెప్పను- రిలీజ్ చేయను

Published on Tue, 06/03/2025 - 15:53

ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)

కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. 'కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు' అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.

కర్ణాటకలో 'థగ్ లైఫ్' నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్‌కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?)

Videos

వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్

డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్

Trinamool: ఎంపీ రహస్య వివాహం

చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ

జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్

ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలి: 11 Fans Dead in Stampede

Photos

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కమల్‌ హాసన్ 'థగ్‌ లైఫ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)

+5

అంబరాన్నంటిన సిరిమాను సంబరం