Breaking News

భగవద్గీత శ్లోకం, బ్లాక్‌ వెల్వెట్‌ గౌను : ఐశ్వర్య సెకండ్‌ లుక్‌పై ప్రశంసలు

Published on Fri, 05/23/2025 - 15:00

ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025  (Cannes Film Festival)లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  ఫ్యాన్స్‌లోని ప్యారిస్‌ లో జరుగుతున్న 78వ కాన్స్‌ ఉత్సవాల్లో వరుగా  రెండోరోజు తన అద్భుతమైన లుక్‌తో   అందర్నీ అలరించింది. మాజీ మిస్ యూనివర్స్.  మొదటి రోజు  చీర, కెంపుల హారం, సింధూరంతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఫ్యాషన్‌  ప్రియులను ఆకట్టుకుంది. రెండో రోజు లుక్‌లో  భారతీయత ఉట్టిపడేలా దర్శనమిచ్చి వావ్‌ అనిపించింది.

కాన్స్‌ వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది.  కానీ ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించడం విశేషం. ప్రముఖ డిజైనర్‌ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన  బ్లాక్‌ వెల్వెట్‌ డ్రెస్‌లో ఆమె తళుక్కున మెరిసింది. ముఖ్యంగా చేతితో  గీతలోని సంస్కృత శ్లోకాన్ని  ఎంబ్రాయిడరీ  చేయించుకోవడం విశేషంగా నిలిచింది. 

బనారసీ కేప్‌పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ’ అనే శ్లోకాన్ని తీర్చిదిద్దుకుంది. వెండి, బంగారం, బొగ్గు , నలుపు రంగుల్లో, మైక్రో గ్లాస్ స్ఫటికాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు డిజైనర్‌ తెలిపారు. అలాగే వారణాసిలో చేతితో నేసిన ఈ కేప్ పై భగవత్ గీతలోని సంస్కృత శోక్లాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు వెల్లడించారు. దీంతో ఐష్‌ లుక్‌పై  ఫ్యాషన్ వర్గాలు సహా, సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.  

ఐశ్వర్య ఫస్ట్‌  లుక్ సంప్రదాయం,  గుర్తింపుకు  చిహ్నంగా ఉండగా, రెండవది పునఃనిర్మాణం ఫ్యాషన్‌కి  గుర్తు అని వ్యాఖ్యానించారు. 78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభమైనాయి.రేపటితో(24)  ఈ వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా

 

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)