Breaking News

రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్‌: తొలిసారి..

Published on Fri, 05/23/2025 - 14:45

బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్‌ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్‌కాయిన్‌ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. గురువారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్లను దాటేసింది. రెండవ స్థానంలో ఉన్న ఈథర్ విలువ కూడా 7.3 శాతం పెరిగింది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్‌ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బిట్‌కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ గరిష్టాలకు నెమ్మదిగా కదులుతోందని.. ఫాల్కన్‌ఎక్స్ లిమిటెడ్‌లోని గ్లోబల్ కో-హెడ్ ఆఫ్ మార్కెట్స్ జాషువా లిమ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..

మైఖేల్ సాయిలర్‌ అనుబంధ సంస్థ ఇప్పటికే.. 50 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ) విలువైన బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా.. కన్వర్టిబుల్ బాండ్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ వంటి అనేక కొత్త టెక్ కంపెనీలు కూడా వివిధ మార్గాల్లో బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్ విలువ మరింత భారీగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)