Breaking News

మిస్‌ వరల్డ్‌ 2025: అందమొక్కటే కాదు..అందమైన మనసు కూడా..

Published on Fri, 05/23/2025 - 10:06

మిస్‌ వరల్డ్‌ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్‌ నగర్‌ విక్టోరియా హోమ్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. 

ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్‌ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు. 

ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్‌ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్‌ వరల్డ్‌ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్‌ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు. 

విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్‌ వరల్డ్‌ చైర్మన్‌ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్‌ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఉమాదేవి శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

(చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు)

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)