Breaking News

నటీ నటుల కోసం రూమ్స్, డ్రగ్స్.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Published on Thu, 05/22/2025 - 16:50

డ్రగ్స్‌ వినియోగం ఆరోపణలతో మలయాళ చిత్రపరిశ్రమ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి నటుడు  షైన్ టామ్ చాకోతో పాటు జింఖానా సినిమా దర్శకుడు ఖలీద్‌ రెహ్మాన్‌ ఈ కేసులో అరెస్టై బయటకు వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా నిర్మాత సాండ్రా థామస్‌(Sandra Thomas) మాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ వాడడం కోసం సినిమా సెట్‌లో ప్రత్యేకమైన గదులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ స్పాట్సే ఇప్పుడు డ్రగ్స్‌ అడ్డాగా మారిపోయానని, ఈ విషయం చాలా మందికి తెలిసినా..తెలియనట్లుగా ఉంటున్నారని మండిపడ్డారు.

‘గత ఐదారేళ్ల క్రితమే మాలీవుడ్‌లో డ్రక్స్‌ వాడకం ఎక్కువైంది. దీనిని అరికట్టేందుకు అప్పుడు అసోసియేషన్‌ ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు సినిమా సెట్స్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఏం జరుగుతుంది? అనేది అందరికి తెలిసినా.. ఎవరూ మాట్లాడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయా నటీనటులతో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డ్రగ్స్‌ అలవాటు చేసుకున్నారు. డ్రగ్స్‌ వాడకం కోసమే ప్రత్యేక బడ్జెట్‌, గదులను కేటాయిస్తున్నారు. ఈ విషయాలన్ని అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ) సభ్యులకు తెలియదా? సెట్స్‌కి వెళితే డ్రగ్స్‌ దొరుకుతుందని తెలియదా? తెలిసినా వారు పట్టించుకోవడం లేదు’ అని ఆమె ఆరోపించారు.

సాండ్రా థామస్‌ విషయానికొస్తే.. మలయాళంలో నటిగా కెరీర్‌ని ఆరంభించిన ఆమె..ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తోంది.  ‘ఫ్రైడే’, ‘ఫిలిప్స్‌ అండ్‌ ది మంకీ పెన్‌’, ‘ఆడు’ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Videos

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)