మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్
Published on Thu, 05/22/2025 - 16:03
హైరా హైరా హాయ్ రబ్బ..హైరా హైరా హాయ్ రబ్బ.. అంటూ యూత్‌అను అలరించి ఫిఫ్టీ కేజీ తాజ్‌మహల్, తేనె కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్. తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందీమాజీ ప్రపంచ సుందరి. అయితే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి,గర్భధారణ, పాపకు జన్మనిచ్చిన తరువాత ఆమె శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ప్రసవం తర్వాత,ఐశ్వర్య శరీర బరువుపై చాలా విమర్శలొచ్చాయి. ముఖ్యంగా వివిధ ప్రపంచ వేదికల మీద ఐశ్వర్య లుక్‌పై చాలా వ్యాఖ్యానాలు, అవమానకర సెటైర్లు చెలరేగాయి. తన శరీర ఆకృతిని జడ్జ్ చేస్తూ, బాడీషేమింగ్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో వచ్చిన వ్యాఖ్యలపై ఎప్పుడూ మౌనంగా, గౌరవ ప్రదంగా కనిపించిన ఐశ్వర్య స్పందించింది.
78వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తనదైన శైలిలో అటు అభిమానులను, తన డ్రీమీ లుక్‌తో ఇటు ఫ్యాషన్ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు, గాసిప్‌లు, తన వెయిట్‌పై ఎన్నడూ స్పందించని ఐశ్వర్య మాత్రం ఒక సందర్భంలో ఆ లెక్క తేల్చేసింది. తనను విమర్శించిన వారిందరికీ ఘాటు రిప్లై వచ్చింది.
ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
2011లో తల్లి అయిన తర్వాత, బరువు కారణంగా తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. గతంలో డేవిడ్ ఫ్రాస్ట్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య తన గర్భధారణ బరువును తగ్గించుకోవడం గురించి అడిగినప్పుడు అసలు దీని గురించి అంత చర్చించాల్సి అవసరం లేదని, ఇది చాలా సహజమని చెప్పుకొచ్చింది. నేను బరువు పెరిగానా లేదా, నీరు పట్టిందా, ఇవేవీ నేను పట్టించుకోను. నా బాడీతో చాలా హాయిగా , సంతోషంగా ఉన్నాను. పాప ఆరాధ్యను చూసుకోవాల్సిన సమయంలో కూడా బయటకు వచ్చాను, లావుగా ఉన్నాననీ, బహిరంగంగా బయటకు వెళ్లడం మానేయలేదని అదే తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని ప్రకటించింది. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదనిపించింది. నా గురించి జనాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉండే నాకేమీ సమస్యలేదు. కానీ నేను మాత్రం బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది.
మాతృత్వం తనను వెనక్కి నెట్టలేదని నిరూపించింది ఐశ్వర్య రాయ్, కెరీర్, కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ, అవమానాలు, అవహేళన వ్యాఖ్యలకు కృంగిపోకుండా, ఒక మహిళగా ఉండాల్సిన ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తోంది.
ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
Tags : 1