Breaking News

జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. చవకైన రీచార్జ్‌ ప్లాన్లు ఇవే...

Published on Wed, 05/21/2025 - 22:13

టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్‌ ప్లాన్‌ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్‌ ప్లాన్లను ఇక్కడ ​అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్వర్క్‌లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్  అపరిమిత  కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్లో మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.

వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్
వొడాఫోన్‌ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.

జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.

వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్
విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్‌లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.

Videos

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)