Breaking News

లెజెండ్‌కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్‌ అజిత్ కుమార్‌

Published on Wed, 05/21/2025 - 19:05

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్‌ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్‌గా త్రిష మెప్పించింది.

అయితే అజిత్ కుమార్‌ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్‌లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్‌లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్‌ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్‌ కుమార్‌ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.

తాజాగా అజిత్ కుమార్‌  ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్‌వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

Videos

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)