అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3
Breaking News
Sagubadi : పర్పుల్ వింగ్డ్ బీన్స్
Published on Wed, 05/21/2025 - 09:50
చిక్కుడు పంటలో బోలెడంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్‌డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్‌డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్.
దక్షిణ ఆసియాలోని రైతులు, వినియోగదారులకు ఈ పర్పుల్ వింగ్డ్ బీన్ (Purple Winged Beans) తెలుసు. దీనితో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని, వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారికి గమనిక ఉంది. మొక్క 3–4 మీటర్లు (9.8–13.1 అడుగులు) ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు.. అన్నీ తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నాటిన మూడు నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి.
పర్పుల్ బీన్ పువ్వులను సలాడ్‌గా తినొచ్చు. లేత ఆకులను కోసి పాకూర మాదిరిగానే ఆకు కూరగా తయారు చేసుకోవచ్చు. వేర్లను పచ్చివి లేదా దుంపల్లా కాల్చుకొని తినొచ్చు. గింజలను సోయా బీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రొటీన్ ఉంటుంది. ఆకులు, పూలలో 10–15% ప్రొటీన్ ఉంటుంది. వింగ్డ్ బీన్స్ పంటకు చీడపీడల బెడద లేదని, ఒక్కసారి నాటితే మళ్లీ మళ్లీ దానంతట అదే పెరుగుతూ ఉంటుందని కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణప్రసాద్ చెబుతున్నారు.చిక్కుడు పంటలో బోలñ డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్‌డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్‌డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్.
Tags : 1