Breaking News

సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ వచ్చేసింది.. సరికొత్తగా..

Published on Sat, 05/17/2025 - 09:11

సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది.

సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టైలిష్ డిజైన్ అంశాలతో మిళితం చేసి సుజుకి యాక్సెస్ స్కూటర్‌ కొత్త ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ ఎనేబుల్డ్, ఫుల్ కలర్ 4.2 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త ఎడిషన్ ముఖ్యమైన ఫీచర్. ఇందులో డిస్‌ప్లే రైడర్‌కు క్లీనర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

కొత్త కలర్‌
కాగా యాక్సిస్‌ వాహనాలకు ఇప్పటికే ఉన్న కలర్‌ ఆప్షన్లకు అదనంగా కొత్త ఎడిషన్ "పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్" రంగును పరిచయం చేస్తుంది. మ్యాట్ ఫినిష్ స్కూటర్ కు ఆధునిక, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీంతోపాటు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే మరో నాలుగు కలర్‌ షేడ్స్‌లోనూ యాక్సిస్‌ కొత్త ఎడిషన్‌ లభిస్తుంది.

సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఎడిషన్ ఇప్పుడు భారతదేశంలోని డీలర్‌షిప్‌లలో రూ .1,01,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లభిస్తుంది. స్మార్ట్ టెక్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ కలర్ స్కీమ్ జోడించడంతో కొత్త వేరియంట్ పోటీ 125 సీసీ స్కూటర్ విభాగంలో యాక్సెస్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)