మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
ప్రతి క్షణం భయపెట్టే థ్రిల్లర్ సిరీస్.. టీజర్ వచ్చేసింది!
Published on Tue, 05/06/2025 - 09:24
సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు ఓటీటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్‌లో తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది. దీంతో స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను కూడా తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఈ సిరీస్ అదే రేంజ్‌లో ఆదరణను సొంతం చేసుకుంది.
ఈ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మూడో సీజన్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ సీజన్ జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..
ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!
జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.
Tags : 1