Breaking News

కావాలని అలా చేయలేదు: కార్తీక్‌ రాజు

Published on Tue, 05/06/2025 - 00:22

‘‘నేను తమిళ డైరెక్టర్‌ని కావడంతో ‘సింగిల్‌’ సినిమాకు తెలుగు నేటివిటీ ఉండాలని ‘సామజ వరగమన’ సినిమాకు పని చేసిన భాను–నందు తెలుగు డైలాగ్స్‌ రాశారు. ఈ మూవీ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్‌పై అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే ఆ డైలాగులు కేవలం వినోదం కోసం పెట్టినవే.. కావాలని అలా చేయలేదు.. ట్రోల్‌ అవ్వాలని కాదు’’ అని డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు అన్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘సింగిల్‌’. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్‌ కీలకపాత్ర చేశారు.

అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్‌ రాజు మాట్లాడుతూ–‘‘వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు’ సినిమాలకు పని చేశాను. దర్శకత్వంపై ఆసక్తితో సూపర్‌ వైజర్‌గా రాజీనామా చేశాను. దర్శకుడిగా నా తొలి సినిమా ‘తిరు డాన్ పొలీస్‌’ను ఎస్పీ చరణ్‌గారు నిర్మించారు. 

తెలుగులో సందీప్‌ కిషన్‌తో నా తొలి మూవీ ‘నిను వీడని నీడను నేనే’. శ్రీవిష్ణుగారికి ‘సింగిల్‌’ కథను 2022 వినిపించగా ఓకే అన్నారు. 2023లో గీతా ఆర్ట్స్‌ వారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. స్కూల్‌ డేస్‌ నుంచి లవ్‌లో పడాలనుకునే అబ్బాయికి, 28 ఏళ్ల వయసు వచ్చినా లవ్‌లో పడలేకపోతాడు. దీంతో తన చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ ప్రేమలో పడకూడదనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. అల్లు అరవింద్‌గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. విశాల్‌ చంద్రశేఖర్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. శ్రీవిష్ణుగారి కోసం నా వద్ద మరో రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు.

Videos

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)