మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
జూన్ లో సితారే జమీన్ పర్
Published on Tue, 05/06/2025 - 00:02
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రోడక్షన్స్పై ఆమిర్‌ఖాన్ , అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమాని జూన్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్’ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ చిత్రం తెరకెక్కిందని, స్పానిష్ ఫిల్మ్ ‘ఛాంపియన్స్’ (2018) ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని బాలీవుడ్ టాక్. అలాగే దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు నెలకొన్నాయి.
Tags : 1