కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
Breaking News
చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!
Published on Mon, 05/05/2025 - 21:12
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చిరు ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీనిపై కంటే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మూవీపై అందరి కళ్లున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చిరంజీవి కోసం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు ఓ పేరు ఫిక్సయ్యారు. ఆమెనే కేథరిన్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
2013 నుంచి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న కేథరిన్.. అల్లు అర్జున్ సరసన రెండు మూవీస్ చేసింది. వీటిలో 'సరైనోడు' ఒకటి. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో నటించింది. రీసెంట్ టైంలో బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటించింది.
ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేథరిన్ ని అదృష్టం వరించినట్లే. ప్రస్తుతానికి ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో మిగతా హీరోయిన్లతో పాటు ఈమె గురించి టీమ్ ప్రకటిస్తారేమో? వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ మూవీ థియేటర్లలో రానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా)
Tags : 1