Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
Published on Mon, 05/05/2025 - 17:55
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.
కొడుకు తైమూర్‌కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ‍్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార‍్చేశాడు.
(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ‍్మ జీవితాంతం నన్ను..: రష్మీ)
'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Tags : 1