జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం
Breaking News
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
Published on Mon, 05/05/2025 - 16:47
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.
యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.
సీఈఓగా వారెన్ బఫెట్ పదవీ విరమణ
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్
Tags : 1