Breaking News

‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!

Published on Mon, 05/05/2025 - 14:08

మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాల​ంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

రుణాలు..

కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.

ఆర్థిక అస్థిరత

పెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.

దుబారా ఖర్చులు..

పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.

ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు

మరేం చేయాలి..

జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి.

#

Tags : 1

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)