కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరి
Published on Mon, 05/05/2025 - 13:24
హైదరాబాద్ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా.. సినిమాలు, టెలిఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల షూటింగ్‌లకు అనుకూలంగా ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తోంది. పేరు మోసిన డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లతో ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. పల్లె వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చని వరి పొలాలు, చెరువులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గుట్టలు ఫిలిం సిటీ పక్కనే ఉండటం..సినిమా నిర్మాణానికి అనుకూలంగా ఉంది. జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, భువనగిరి, రాజాపేట ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. కోనసీమను మించిన అందాలు జిల్లాలో కనువిందు చేయడం, హైదరాబాద్‌కు అతి దగ్గరగా ఉండటం.. కలిసి వస్తోంది. ప్రజల ఆత్మీయత, నిర్మాతలకు ఖర్చు తక్కువగా కావడం, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్నాయి. – సాక్షి, యాదాద్రి
పోచంపల్లిలోనే ఎక్కువ షూటింగ్‌లు
పోచంపల్లిలో ‘జైబోలో తెలంగాణ’ చిత్రం హీరో హీరోయిన్‌ల మధ్య పాటలను చిత్రీకరించారు. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు, సీనియర్ నరేశ్, రామ్‌చరణ్, సాయికుమార్, నితిన్, గిరిబాబు, జయసుధ, హాస్య నటులు, కొత్త నటీ నటులతో సినిమాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. దర్శకులు సుకుమార్, తివిక్రమ్.. ఇంకా ఎందరో దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. ఇక్కడి కట్టెకోత మెషీన్‌లో పుష్ప–2 సినిమా షూటింగ్ కూడా జరిగింది. ‘సీతా కల్యాణ వైభోగమే’ చిత్రాన్ని కూడా ఇక్కడే తీశారు. సాయికుమార్ చేనేత కళాకారునిగా మగ్గం నేయడం, గ్రామస్తులతో మాట్లాడడం, బైక్‌పై వెళ్లడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో బాలకృష్ణ ఇటీవల తీసిన ‘డాకు మహరాజ్’ సినిమాలోని రాజస్తాన్ గ్రామం సెట్ వేసి.. పలు సన్నివేశాలను చిత్రీకరించారు. భువనగిరి ఖిలాపై హిందీ, తెలుగు సినిమాల షూటింగ్‌లు జరిగాయి.
రాజాపేట పోలీస్ స్టేషన్‌లో, భువనగిరిలోని డిగ్రీకళాశాలలో ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాన్ని అప్పట్లో చిత్రీకరించారు. ఈ సిని మాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిగా నటించారు. హీరోగా శ్రీకాంత్ నటించారు. కాగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి ఎఫ్‌సీఐ గోదాముల్లో రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ నాలుగు రోజులు జరిగింది. భువనగిరి ఖిలాపై సినిమాలు తీశారు. బీబీనగర్ మండలం మహ దేవ్‌పూర్‌లో అక్కన్నమాదన్నలు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం, జియాపల్లి, నాగినేనిపల్లిలో తాటిచెట్లు, చెరువుతో గ్రా మీణ వాతావరణం ఉంటుంది. ‘రజాకార్’ సినిమాలోని బతుక మ్మ పాట చిత్రీకరణ, కొన్ని ఫైట్ సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఇక్కడ విద్యుత్ తీగలు లేకుండా పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉంటుంది. మహదేవ్‌పూర్‌లో సినీనటుడు శ్రీకాంత్ నటించిన ‘దేవరాయ’ షూటింగ్ ఇక్కడే జరిగింది. ‘ఎగిరే పావురమా’ సినిమాను బీబీనగర్ పాతరోడ్డు వంతెనపై చిత్రీకరించారు.
15 ఏళ్లుగా షూటింగ్‌లు
భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్, రేవణపల్లి, కొత్తగూడెం గ్రామాల్లో 15 ఏళ్లుగా సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. వందకు పైగా సినిమా షూటింగ్‌లు జరిగాయి. హైద రాబాద్‌కు దగ్గరగా ఉండటం, పోచంపల్లి శివారులో గ్రామీణ వాతా వరణం, చేనేత గృహాలు, రైతుల ఇళ్లు, పాతకాలం నాటి గచ్చు పెంకుటి ళ్లు, షూటింగ్‌లకు అనుకూలంగా పచ్చదనం, తాటివనాలు, పర్యాటక వసతి అందుబాటులో ఉండటం ప్రయోజనకరంగా మారింది.
చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
రాచకొండలో పలు షూటింగ్‌లు..
రాచకొండ ఫిలిం సి టీకి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతమంతా గుట్టలతో నిండి ఉంది. ప్రకృతి అందాలను మైమరపించే లొకేషన్లతోపాటు, గుట్టల పై నుంచి జాలువారే సెల యేళ్లు ఉన్నాయి. అపురూ పవైన కట్టడాలు, చారిత్రక సంపద ఎంతో ఉంది. రాచ కొండ గుట్టల్లో ఇప్పటికే పలు సినిమాలు రూపుది ద్దుకున్నాయి. చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా షూటింగ్ 2019లో దండుమల్కాపూర్‌లో జరిగింది. శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగే పూజలు, పాట, ఫైటింగ్ సన్నివేశాలను ఇక్కడ నెల రోజుల పాటు తీశారు. మల్కాపురం ఘాట్ కంచె భూముల్లో ‘రెబల్’ చిత్రం క్లైమాక్స్ సన్నివేశంతో పాటు, పవన్‌న్‌కల్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ సినిమా చివరి సన్నివేశాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. మహేశ్‌బాబు హీరోగా నిర్మించిన ‘ఆగడు’ చిత్రం క్లైమాక్స్ ఫైట్‌ను కూడా ఇక్కడే తీశారు. రాచకొండలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘విరోధి’, ‘సీతారాముల కల్యాణం’లో క్లైమాక్స్ ఫైట్లను చిత్రీకరించారు. ‘జానకిరామ’ హిందీ సీరియల్ నిర్మాణంతో పాటు అనేక షార్ట్ ఫిలింలను చిత్రీకరించారు.
హైదరాబాద్ శివారు కావడంతో..
సినిమా పరిశ్రమ కేంద్రీకృతమైన హైదరాబాద్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా శివారులోనే ఉంది. దేశంలోని పలువురు సినీరంగ ప్రముఖులు హైదరాబాద్ చేరుకునే అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో ఉంది. స్థానికులు సినిమా వారిని ప్రేమతో ఆదరిస్తారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లాగే.. సినిమాకు అనువైన ప్రాంతాలు జిల్లాలోనూ ఉన్నాయి. ఎత్తయిన గుట్టలు, కొండలు, పచ్చని పొలాలు, జలపాతాలు.. సినిమా షూటింగ్‌లకు కలిసి వస్తున్నాయి. సినిమా నిర్మాతలకు తక్కువ వ్యయం అవుతోంది. దీనికితోడు ఇక్కడ ఉదయం సినిమా షూటింగ్‌లు చేసి.. సాయంత్రం హైదరాబాద్‌లోని తాము బస చేసిన హోటళ్లకు, ఇళ్లకు చేరుకోవచ్చు, విశాలమైన రోడ్డు సౌకర్యంతో పాటు, అందమైన లొకేషన్లు ఉండడం డైరెక్టర్లను ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
Tags : 1