విరాట్ కోహ్లికి ఏమైంది..? మ‌ళ్లీ ఫెయిల్‌! వీడియో వైర‌ల్‌

Published on Thu, 06/27/2024 - 22:38

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన సెమీఫైనల్లోనూ కోహ్లి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో విరాట్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో రెండో బంతికి విరాట్ భారీ సిక్స్ బాదాడు. దీంతో కింగ్ ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని అంతా భావించారు. కానీ అదే ఓవ‌ర్‌లో నాలుగో బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ‌య్యాడు. 

ఈ మెగా టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అందులో రెండు డ‌క్‌లు కూడా ఉన్నాయి. కాగా గ‌త నాలుగు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల సెమీస్‌లోనూ కోహ్లి హాఫ్ సెంచ‌రీలతో మెరిశాడు. కానీ ఈ సారి మాత్రం సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. దీంతో కోహ్లికి ఏమైంద‌ని పోస్ట్‌లు చేస్తున్నారు. ఓపెన‌ర్‌గా రావ‌డం వ‌ల్ల కోహ్లి విఫ‌ల‌మ‌వుతున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు.

Videos

సినిమా డైలాగులు చెబితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటీ..?: వైఎస్ జగన్

ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున పోరాటం ఆగేది లేదు

కాంగ్రెస్ నేత మారెల్లి అనిల్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు మాకు సహకరించలేదు: వైఎస్ జగన్

లోకేష్ లైనప్ మామూలుగా లేదుగా..!

ఇంకా మూడేళ్లు.. కళ్లు మూసుకుంటే బాబు ఎగిరిపోతాడు..!

YS Jagan: మేం అధికారం లోకి వస్తే.. నేను చేప్పినా సరే మా వాళ్ళు మాత్రం

రప్పా రప్పా కాంట్రవర్సీ.. సినిమా డైలాగులు నచ్చకపోతే.. వైఎస్ జగన్ సెటైర్లు

పేర్ని నాని, అనిల్ కుమార్ పై కేసులు వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు పాలనలో D.I.G అనేవాడు మాఫియాకి పెద్ద డాన్

Photos

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)

+5

బ్రిట‌న్ కింగ్ చార్లెస్‌-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)

+5

వాణీ కపూర్‌ ‘మండల మర్డర్స్‌’ ట్రైలర్‌ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)