శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే..!

Published on Wed, 06/26/2024 - 15:05

మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్‌ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్‌ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్‌, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్‌ ఇలా..

తొలి టీ20- జులై 27
రెండో టీ20- జులై 28
మూడో టీ20- జులై 30

తొలి వన్డే- ఆగస్ట్‌ 2
రెండో వన్డే- ఆగస్ట్‌ 4
మూడో వన్డే- ఆగస్ట్‌ 7

ఈ సిరీస్‌కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్‌ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జరుగనున్నాయి.

తొలి టీ20- జులై 6
రెండో టీ20- జులై 7
మూడో టీ20- జులై 10
నాలుగో టీ20- జులై 13
ఐదో టీ20- జులై 14

జింబాబ్వే సిరీస్‌కు భారత జ‌ట్టు
శుభ్‌మ‌న్‌ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే.

Videos

Jogi Ramesh: నాపై దాడికి ప్లాన్..!

జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు

బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు

TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం

బాబు, పోలీసులపై కోర్టు సీరియస్

Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..

పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్

టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..

పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్

Photos

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)

+5

‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)