నాపై 74 తులాల బంగారం చోరీ కేసు, చచ్చిపోదామనుకున్నా:నటి | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్‌పై పరువునష్టం దావా!

Published Mon, Mar 25 2024 3:44 PM

Actress Sowmya Shetty Ready To File Defamation Case On Geetu Royal, Dhanush - Sakshi

జూనియర్‌ ఆర్టిస్ట్‌, నటి సౌమ్య శెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిందంటూ కొద్దిరోజుల క్రితం ఓ వార్త వైరలైంది. విశాఖపట్నం దొండపర్తిలో రిటైర్డ్‌ పోస్టల్‌ అధికారి జనపాల ప్రసాద్‌బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నగల్లో కొంత విక్రయించి గోవా వెళ్లి ఎంజాయ్‌ చేయగా మిగిలిన 40 తులాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

నోరు నొక్కేస్తున్నారు
బెయిల్‌మీద బయటకు వచ్చిన సౌమ్య ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్‌లో లేకపోయినా రిమాండ్‌లో ఉంది, జైల్లో ఉందంటూ అసత్య ప్రచారం చేసి నన్ను జాతీయ స్థాయిలో పాపులర్‌ చేశారు. బయటకొచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా.. కానీ నా భర్త బతికి పోరాడాలని చెప్పారు. ఫైట్‌ చేస్తాను.

పోరాడతా..
మీరు అబద్ధాన్ని నిజం చేశారు. కానీ నన్ను భయపెట్టలేరు. నాకు దొంగ అని ట్యాగ్‌ వేసి పిచ్చికుక్కను చేసి జైల్లో వేద్దామనుకున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనూ నా నిజం చెప్పుకోవాలి. కోర్టులో ఏది రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేశారు. నా వైపు దేవుడున్నాడు. పోరాడతాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. అలాగే రిటైర్డ్‌ పోస్టల్‌ అధికారి కుటుంబానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్‌, ధనుష్‌లపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్‌లో..!

Advertisement
Advertisement