ఊర పండుగకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఊర పండుగకు సర్వం సిద్ధం

Published Sat, Aug 1 2015 5:10 PM

ఊర పండుగకు సర్వం సిద్ధం

నిజామాబాద్ టౌన్ : ప్రతి ఏడాది నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించే ఊర పండుగకు శనివారం సర్వం సిద్ధం చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఊర పండుగను నిజామాబాద్‌లో 1935వ సంవత్సరం నుంచి సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.

ఈ పండుగకు ప్రత్యేకంగా మామిడి చెక్కతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేస్తారు. ఈ అమ్మవార్ల విగ్రహాలను పండుగ నాడు నగరంలో ఊరేగిస్తారు. అదే సమయంలో ఒక్కో అమ్మవారి విగ్రహాన్ని నగరంలోని ఒక్కో దేవాలయంలో ప్రతిష్టించుకుంటూ వెళ్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు నగరంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేస్తారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement