‘అగ్రి’ పాలిటెక్నిక్‌ నోటిఫికేషన్‌ విడుదల | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ పాలిటెక్నిక్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Thu, Jun 1 2017 12:30 AM

'Agri' Polytechnic Notification Release

దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 21
 
జగిత్యాల అగ్రికల్చర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యం లో రెండేళ్ల వ్యవసాయ పాలి టెక్నిక్‌ కోర్సు కోసం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ కోర్సుకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఆఖరు తేదీ 2017 జూన్‌ 21గా ఉంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం అగ్రికల్చర్, సీడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అగ్రికల్చర్, సీడ్‌ టెక్నాలజీ కోర్సు రెండేళ్లు కాగా, అగ్రికల్చ ర్‌ ఇంజనీరింగ్‌ మూడేళ్లు. రాష్ట్రంలో ఉన్న 18 అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలుం డగా ఇందులో 11 ప్రభుత్వ కళాశాలల్లో 330 సీట్లు, 7 ప్రైవేట్‌ కళాశాలల్లో 420 సీట్లు ఉన్నాయి. రెండు సీడ్‌ టెక్నాలజీ కాలేజీలుండగా ఒక ప్రభుత్వ కాలేజీలో 30 సీట్లు, ఒక ప్రైవేట్‌ కళాశాలలో 60 సీట్లున్నాయి.

అగ్రికల్చర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాలలు 4 ఉండగా, ఒక ప్రభుత్వ కళాశాలలో 30 సీట్లు, 3 ప్రైవేట్‌ కళాశాలల్లో 90 సీట్లున్నాయి. ప్రభుత్వ కళాశా లలో ఫీజు రూ. 2,250, ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజు రూ. 16 వేలుగా ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్ల, జగి త్యాల, జమ్మికుంటలో ఒక్కో ప్రభుత్వ కళాశాల ఉంది. రెండేళ్ల పాటు కోర్సు తెలుగు మీడియంలో ఉంటుంది.1 నుంచి పదో తరగతి లోపు నాలుగేళ్ల పాటు ఎక్క డైనా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారే  దరఖాస్తుకు అర్హులు. పదో తరగతిలో ఓసీ , బీసీలకు 5 జీపీఏ, ఎస్సీ, ఎస్టీలకు 4 జీపీ ఏ గ్రేడ్‌ పాయింట్‌ వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 22 ఏళ్ల వయ సున్న వారు అర్హులు. ఓసీ, బీసీలు రూ.725, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులు రూ. 425 దరఖాస్తు రుసుం చెల్లించాలి.  

Advertisement
 
Advertisement