ముసాయిదా గడువు ముగిసింది.. ఇప్పుడెలా..? | Sakshi
Sakshi News home page

ముసాయిదా గడువు ముగిసింది.. ఇప్పుడెలా..?

Published Wed, Jun 15 2016 1:41 AM

ముసాయిదా గడువు ముగిసింది.. ఇప్పుడెలా..? - Sakshi

  • తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల్లో 6 టీఎంసీలు కోరిన ఏపీ
  • ముసాయిదా గడువు ముగియడంతో సందిగ్ధంలో బోర్డు, ఏం చేయమంటారని తెలంగాణకు లేఖ
  •  

     సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ఏపీకి తాగునీటి అవసరాల నిమిత్తం నీటి విడుదల చేసే విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సందిగ్ధంలో పడింది. గత ఏడాది ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ముసాయిదా గడువు జూన్ ఒకటవ తేదీతో ముగియడం, మళ్లీ నీటి వినియోగం, విడుదలపై పర్యవేక్షణ చేయాలంటే కొత్త ముసాయిదా అమల్లోకి రావాల్సి ఉండటం, ఇంతలోనే ఏపీ 6 టీఎంసీల నీటిని కోరడంతో ఎలాంటి నిర్ణయం చేయాలన్న ప్రశ్నను ఎదుర్కొంటోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని, అభిప్రాయాన్ని తెలపాలని తెలంగాణను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు.

    ఈ లేఖలో.. గత ఏడాది చేసుకున్న ఒప్పంద ముసాయిదా గడువు ఈ నెల ఒకటో తేదీతోనే ముగిసిందని, వచ్చే ఏడాది నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలతో స మావేశం ఏర్పాటు చేయాలని ఏపీ కోరినా దీనిపై తె లంగాణ ఇంతవరకు అభిప్రాయం చెప్పలేదని వివరించారు. కానీ ఇంతలోనే 6 టీఎంసీలు విడుదల చే యాలని ఏపీ కోరిందని తెలిపారు. ఈ నెల 21న కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగే సమావేశం, అ క్కడ ముసాయిదా ఆమోదం పొందే వరకు నీటి వి డుదలపై తామేమీ చేయలేమని, ఈ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వమే ఒక నిర్ణయం చేయాలని సూ చించారు. ఏపీకి నిజంగా అంత నీటి అవసరం ఉందా? అన్న అంశాలను పరిశీలించి,  ఏపీకి సాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు చేసిన నీటి వి నియోగంపై వివరాలు సమర్పించాలని సూచించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement