రౌడీయిజం, దౌర్జన్యాలు అనే పదాలు వినిపించొద్దు | Sakshi
Sakshi News home page

రౌడీయిజం, దౌర్జన్యాలు అనే పదాలు వినిపించొద్దు

Published Tue, May 21 2024 11:15 AM

రౌడీయిజం, దౌర్జన్యాలు అనే పదాలు వినిపించొద్దు

ఫిలింనగర్‌: నగరంలో రౌడీయిజం, దౌర్జన్యం అనే పదాలు ఇకపై వినిపించరాదని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందిని, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలంటే పోలీసులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. రౌడీయిజం, దౌర్జన్యాలు అనే పదాలు వినిపించకుండా పోలీసుల పనితీరు ఉండాలన్నారు. ఫిలింనగర్‌ పోలీసుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి, ఫిలింనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement