No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 21 2024 11:20 AM

No Headline

సాక్షి, సిటీబ్యూరో: నగరం వేదికగా నూతనంగా ప్రారంభించిన వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌లో టాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. భారత లెజెండరీ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి స్థాపించిన వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ ఇకపై హైటెక్‌ సిటీ వేదికగా నగరవాసులకు పసందైన రుచులను అందించనుంది. ఈ రెస్టారెంట్‌ వేదికగానే ప్రముఖ సినీనటుడు మంచు మనోజ్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు లక్ష్మి, నాని, అడివి శేష్‌, నిఖిల్‌, తేజ సజా, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌, ఆకా ష్‌ పూరి, అభిరామ్‌ తదితర టాలీవుడ్‌ నటులు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్‌ 8 కమ్యూన్‌ కో–ఫౌండర్‌ వర్తిక్‌ తిహారా మాట్లాడుతూ., జుహు, బెంగళూరు, గుర్గావ్‌తో పాటు నగరంలో నూతన స్టోర్‌ ప్రారంభించామని, ఇలాంటి వినూత్న రెస్ట్రో బార్‌కు హైదరాబాద్‌ అనువైన కేంద్రమని తెలిపారు. విరాట్‌ కోహ్లి ఇష్టపడే మెనూ ఇక్కడ లభిస్తుందని, విభిన్నమైన డిష్‌లతో పాటు స్థానికి రుచు ల మేళవింపుతో వన్‌ 8 కమ్యూన్‌ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement