హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు | Sakshi
Sakshi News home page

హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు

Published Tue, May 21 2024 11:15 AM

హిట్‌

నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్‌ ఎస్సై శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్‌ సీతారమేష్‌(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్‌ లక్కీ కేఫ్‌ సమీపంలోని ఐరావత్‌ ఐ క్లినిక్‌ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్‌ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్‌ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్‌ పక్కన బీరు బాటిల్‌ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌కావడంతో ఆలస్యంగా వెలుగులోకి

కారులో మద్యం బాటిల్‌ ఉన్నట్లు గుర్తింపు

హిట్‌ అండ్‌ రన్‌  కేసు నమోదు
1/1

హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు

Advertisement
 
Advertisement
 
Advertisement