అనవసర ఆడంబరాలకు పోవద్దు | Sakshi
Sakshi News home page

అనవసర ఆడంబరాలకు పోవద్దు

Published Sat, Sep 19 2015 12:17 AM

అనవసర ఆడంబరాలకు పోవద్దు

సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు
టారో బాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

కొత్త అవకాశాలు వస్తాయి. మీ లక్ష్యాలు, ఆశయాలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని బంధాలు విసుగు పుట్టిస్తాయి. కొత్త ఉద్యోగానికి మారే ముందు మీరు ప్రస్తుతం ఉన్నదే మెరుగుపడే అవకాశం ఉందేమో చూసుకోండి. ఇల్లు మారతారు లేదా కొత్త ఇంటి కలను నెరవేర్చుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. పాజిటివ్‌గా ఆలోచించండి. కలిసొచ్చే రంగు: పీచ్

టారస్ (ఏప్రిల్ 21-మే 20)
ఇంతవరకూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలే ఇప్పుడు మీకు చాలా సులభమనిపిస్తాయి. రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెడతారు. కొత్త ప్రాజెక్టుల గురించి కలలు కంటారు. వాటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు కూడా. ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: బ్లూ షేడ్ ఆధ్యాత్మికంగా మీరు చాలా ఉన్నతికి చేరతారు. మీరు చేయాలనుకున్న వాటిని ప్రశాంతంగా చేస్తారు. పింక్ కలర్ దుస్తులు, యాక్సెసరీస్‌ను ధరించడం వల్ల మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. మరింత డబ్బును ఆర్జిస్తారు. కలిసొచ్చే రంగు: పింక్

జెమిని (మే 21-జూన్ 21)
విజయం మీకు చేరువలోనే ఉంది. స్థిరాస్తికి, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో గట్టి నిర్ణయం తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల సలహాను వినండి, మీ వంతు నిర్ణయాన్ని తీసుకోండి కానీ, గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో లేదా మీ పనిప్రదేశంలో మార్పునకు అవకాశం కనిపిస్తోంది. కలిసొచ్చే రంగు:ఎల్లో

క్యాన్సర్ (జూన్22-జూలై 23)
అహాన్ని అదుపులో పెట్టి, శ్రేయోభిలాషులు చెప్పిన మాటను చెవిన వేసుకోండి. నలుపు దుస్తులను ధరించడం ద్వారా మీరు అహంకారులు కారని చాటుకోండి. వాహన యోగం కనిపిస్తోంది. మీరు కన్న కొన్ని కలలు మీకు నిద్రను దూరం చేస్తాయి. అయితే ఆ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసొచ్చే రంగు: బ్లాక్
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. పనివిషయంలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. దురలవాట్లను వదిలి, మంచివాటిని అలవరచుకోవలసిన తరుణమిది. సూర్యనమస్కారాలు లేదా సన్ యోగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. కలిసొచ్చే రంగు: గోల్డ్
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. కలిసిచ్చే రంగు: ఆరంజ్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఈ వారం మీకు అదృష్టకరంగా ఉంటుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు లేకుండా గడుస్తుంది. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తి మీకు మళ్లీ తారసపడతారు. వారితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని మీరు ప్రయత్నిస్తారు. కలసివచ్చే రంగు: క్రీమ్

శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఎక్సర్‌సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: ఆరంజ్

అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
మీరేమిటో, మీ సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన వారమిది. మీరు ఏమీ తెలియని వారు, అమాయకులు అనుకున్న వారు మిమ్మల్ని చూసి షాకయ్యేవిధంగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి, బయటికి ఒకటి అన్నట్లుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్నింటినీ అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: పర్పుల్
 
సౌర వాణి
చేసే వృత్తి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు సహకరించే అవకాశం ఉంది. వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటుంది. బంధువులు సకాలంలో తగు సహాయాన్ని చేసి ఆదుకునే స్థితి గోచరిస్తోంది. ఆదాయం లేని స్థిరమైన ఆస్తిని అమ్మేసే ఆలోచన రావచ్చు. దాన్ని కొద్దికాలం వాయిదా వేయండి. చదువుల నిమిత్తం కొంత పొదుపు అవసరం.

 అకస్మాత్తుగా వచ్చిపడే ఖర్చులతో మీరు బాధపడుతుంటే, మీ నుంచి రుణాన్ని కోరినవారు, మీరు ఇవ్వలేదంటూ నిందవేసే అవకాశం ఉంది. అటువంటివారిని ఉపేక్షించకుండా ధైర్యంగా సమాధానమివ్వండి. ఉదాసీనంగా వ్యవహరించవద్దు. అపరిచితులకు మాట సాయాన్ని కూడా చేయకండి. తాత్కాలికంగా గ్రహాల ప్రతికూల సంచారం జరుగుతోంది.
 
ఏదో మాట్లాడుతున్న వంకతో బంధువులకీ, మిత్రులకు మీకు కావలసిన రుణాన్ని గురించి వివరించండి. మీతో నిజమైన బాంధవ్యం, మైత్రీ నెరపేవారెవరో, అభిమానించేవారు ఎవరో మీకు మీరుగా గ్రహించుకోండి. మీ సంతానం యొక్క బుద్ధి విద్యారంగంలో మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటుందని గమనించండి.
 
బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి, ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకోగానే మొత్తం ప్రణాళికని మార్చవలసిన అవసరం వస్తుంది. ఈ స్థితి మొత్తం తాత్కాలిక శారీరక అనారోగ్యానికి సాక్ష్యం తప్ప మరోటి కాదు. మీ అత్తమామలూ, తలిదండ్రులూ సఖ్యతతో గడుపుతారు. ఉద్యోగం ఎప్పుడు పోతుందా అనే మనోవేదనతో ఉండకండి. ఆ అవసరం ఇప్పట్లో లేదు.
 
ధనార్జనకి లోటుండదు గానీ, అధిక శ్రమమీద లభిస్తుంది. ఒకప్పుడు ఎంత తేలిగ్గా సొమ్ము ఆర్జించారో, అదే సొమ్ముని ఆర్జించడానికి నేడు పడే శ్రమ మీకు తెలియడం జీవితంలో చక్కని మలుపు. మీకు తెలియకుండానే పొదుపరితనం అలవడుతుంది. కుటుంబ వ్యక్తుల సంపూర్ణ సహకారం లభిస్తూ, ఆర్థిక విషయాల్లో మీకు మరింత అనుకూలించడం మీ అదృష్టం.
 
ఎంత ప్రయత్నించినా మీ ఖర్చులను మీరు నియంత్రించుకోలేని పరిస్థితి కన్పిస్తోంది. ఉన్నంతలోనే జాగ్రత్తగా ఖర్చు చేయండి తప్ప రుణాలను చేయనేవద్దు. ఆడంబరం, ఆర్భాటమనేవే మధ్యతరగతి సంసారాలని పాతాళానికి పడేసే భూకంపాలు. బంధుమిత్రులపై ఆధారపడకుండా మీ ప్రయత్నాలను మీరే చేసుకోండి, విజయం పొందుతారు.
 
జీవిత భాగస్వామితో విరోధం ఉన్నట్లయితే, మధ్యవర్తులతో, ఉత్తరప్రత్యుత్తరాలతో కాలక్షేపం చేయకుండా నేరుగా వెళ్లి వారితో మాట్లాడుకుని, పరిస్థితిని సానుకూలపరచుకోవడం సరైన కర్తవ్యం. పట్టుదలకైనా ఓ సడలింపు ఉండడం మంచిదని గ్రహించండి. లేనిపక్షంలో పరిస్థితి మీ చేతినుండి అదుపుతప్పి తీరుతుంది.
 
ఒకప్పుడు మీకున్న పట్టుదలా, కోపమూ పూర్తిగా తొలగిపోయి శాంతంగా మారిపోతారు. బంగారంలో మాలిన్యం తొలగినట్లు మేలిమి బంగారమైనట్లు ఉంటారు మీరు. ధైర్యంగా ఉంటే చిక్కుముడులన్నీ క్రమంగా వీడిపోతాయి. వ్యవసాయ రంగంలోని వారికి, పరిశ్రమల రంగంలోని వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది అన్పిస్తుంది.
 
మీరు చేస్తున్న వృత్తిలో మీ ప్రతిభ గుర్తించబడి మీ స్థానం పెరుగుతుంది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నారనిపించగానే యాజమాన్యానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్లి సలహాలూ, సూచనలూ ఇవ్వద్దు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే కారణంగా అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి.
 
పని ఒత్తిడిమూలంగా మీరు తీసుకునే తాత్కాలిక నిర్ణయాల కారణంగా కుటుంబ వ్యక్తులు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కుటుంబసభ్యులను పట్టించుకోవడం అవసరమని గ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏదో ఎర చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటే, ఎంత పెద్దవారినైనా నమ్మవద్దు. తొందర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
 
సంతానం చేస్తున్న ఖర్చులని ఓమారు జాగ్రత్తగా సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రుల్ని మీరు మీ దగ్గరుండి చూసుకుని ఆనందపరచండి లేదా వీలుచేసుకుని ఓరోజు వాళ్ల దగ్గర ఉండి రండి. వాళ్ల ఆశీస్సులు మీకు పరిష్కార మార్గాలవుతాయి. మీకున్న సమస్యలకు ఏ సందర్భంలోనూ ఎటువంటి పరిస్థితిలోనూ న్యాయస్థానపు తలుపు తట్టవద్దు.
 
మీ విషయాల్ని వేరే వ్యక్తుల నుండి తెలుసుకుని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మీతో చనువు పెంచుకుంటున్న వ్యక్తుల్ని విశ్వసించకండి. మీ సమస్యలను వారికి చెప్పకండి. మీ కుటుంబానికి ఆప్తులూ, పట్టుదలకు పోనివారు అయిన వ్యక్తుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. నూటికి 60 శాతం అనుకూలించే అవకాశం వుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement