18న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇంటర్నేషనల్‌ సెమినార్‌ | Sakshi
Sakshi News home page

18న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇంటర్నేషనల్‌ సెమినార్‌

Published Tue, May 14 2024 9:05 AM

18న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇంటర్నేషనల్‌ సెమినార్‌

తగరపువలస : జపాన్‌కు చెందిన 10వ డాన్‌ బ్లాక్‌బెల్ట్‌ గ్రహీత తకాషి మసూయమి ఆధ్వర్యంలో అక్కడి మార్షల్‌ ఆర్ట్స్‌ షోలీ టైటిల్‌కు సంబంధించి ఈ నెల 18న విశాఖ పోర్ట్‌ స్టేడియంలో ఇంటర్నేషనల్‌ సెమినార్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జీవీఎంసీ భీమిలి జోన్‌ ఒకటో వార్డు ఆదర్శనగర్‌లోని పీఎన్‌ఆర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ వేసవి శిక్షణ శిబిరంలో ఆల్‌ ఇండియా మార్షల్‌ ఆర్ట్స్‌ చీఫ్‌ ఎగ్జామినర్‌ అండ్‌ కోచ్‌ పి.నరసింహారావు ఆదివారం తెలిపారు. బ్రౌన్‌, బ్లాక్‌ బెల్టులు కలిగిన 150 మందికి ఈ సెమినార్‌లో ప్రవేశం ఉంటుందన్నారు. 19న అక్కడే నేషనల్‌ కరాటే చాంఫియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

35 ఏళ్లుగా వేసవి శిక్షణ శిబిరం

పీఎన్‌ఆర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ తరపున విశాఖ, విజయనగరం, భీమిలి, పోలిపల్లి, ఎలమంచిలి తదితర ప్రాంతాల్లో ఏటా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తగరపువలసలో బ్లాక్‌ బెల్ట్‌ గ్రహీత బంగారు పరదేశి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరానికి 35 ఏళ్లు నిండాయన్నారు. 45 రోజులపాటు జరిగే ఈ ఉచిత శిక్షణకు పరదేశి సొంతంగా చిన్నారులకు పాలు, గుడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కోచ్‌లు బంగారు గౌతమ్‌, కర్రి చిట్టిబాబు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement