-
ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? కానీ అదే టెన్షన్
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. లెక్క ప్రకారమైతే మే 9న థియేటర్లలో రిలీజ్ కావాలి. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థకు అచ్చొచ్చిన తేదీ ఇది. కానీ ఓ వైపు గ్రాఫిక్స్ పనులు ఆలస్యం, మరోవైపు ఏపీలో ఎన్నికల హడావుడి వల్ల తప్పని పరిస్థితిల్లో వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఏమై ఉంటుందా అని అభిమానుల మధ్య డిస్కషన్. సరిగ్గా ఇలాంటి టైంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 'కల్కి' రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేశారు? సంగతేంటి?'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ రిలీజ్ విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. 'కల్కి' కూడా ఇందులో మినహాయింపు కాదు.మే 9న పక్కాగా వస్తామని నిర్మాతలు ఫిక్సయ్యారు. కానీ పలు కారణాల వల్ల మార్చుకోక తప్పలేదు. జూన్, జూలై అని రెండు ఆప్షన్స్ అనుకున్నారు. ఫైనల్‌గా జూన్ 27న రావాలని అందరూ ఫిక్సయ్యారట. శనివారం సాయంత్రం కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయం చెప్పబోతున్నారట. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో కూడా జూన్ 27నే రిలీజ్ అవుతుందన్నట్లు చూపించేస్తుంది.జూన్ 27న 'కల్కి' రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నాయి. ప్లస్సుల విషయానికొస్తే.. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరైన మూవీ పడటం లేదు. 'కల్కి'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు మోత గ్యారంటీ. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఇమేజ్ కూడా 'కల్కి'కి ప్లస్ అవుతుంది. మైనస్సుల విషయానికొస్తే.. జూన్ చివర్లో పండగలు, సెలవులు అంటూ ప్రత్యేకంగా లేవు. స్కూల్, కాలేజీలు అప్పటికే తెరిచేస్తారు. దీని వల్ల కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు. కమల్ 'ఇండియన్ 2' కూడా ఇదే నెలలో రిలీజ్ ఉండొచ్చు. ఇదే జరిగితే సౌత్‌లో 'కల్కి' వసూళ్లు కాస్త తగ్గే ఛాన్సులు ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో? -
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ? నిజమేంటి?
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా? చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏకంగా వెడ్డింగ్ వైబ్స్ అని కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతోనే ఈ చర్చంతా తెరపైకి వచ్చింది. గతంలో ఈమె పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? పెళ్లి గురించి వస్తున్న వార్తల సంగతేంటి అనేది ఓసారి చూద్దాం.తమిళ బ్యూటీ మేఘా ఆకాశ్.. 'లై' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. గతేడాది ఓ మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈమె పెళ్లి గురించి వార్తలొచ్చాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని మాట్లాడుకున్నారు. ఎవరూ స్పందిచకపోవడంతో దీని గురించి అందరూ మర్చిపోయారు.తాజాగా మరోసారి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో మేఘా ఆకాశ్ దర్శనమిచ్చింది. వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఈమె మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలో చేసుకోనుందని అన్నారు. మేఘా పెళ్లి న్యూస్ నిజమే అయినప్పటికీ.. మరికొన్ని రోజుల తర్వాతే అది ఉండొచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం యాడ్ షూట్‌కి సంబంధించినవి అని తెలుస్తోంది. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!
పూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసింది. కానీ వరస ఫ్లాపుల దెబ్బకు పూర్తిగా ఈమెకు ఇక్కడ పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో లేనప్పటికీ కోట్లు ఖరీదు చేసే బంగ్లాలోకి మారనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే.. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'ముకుంద' అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డీజే', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' తదితర చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ నుంచి సైడ్ అయిపోయింది. ప్రస్తుతం హిందీలో దేవా, శంకీ అనే చిత్రాలు చేస్తున్న పూజా.. ముంబయిలోని బాంద్రాలో దాదాపు రూ.45 కోట్లు విలువ చేసే మేన్షన్ లోకి మారనుందట. ఇది సమద్రం ఫేసింగ్ తో ఉండటంతో పాటు దాదాపు 4000 S.ft విస్తీరణం ఉంది. ఇంకా చాలా సదుపాయాలే ఉన్నాయట. అయితే పూజా హెగ్డే.. దీన్ని కొనేసిందా? అద్దె ప్రాతిపదికన తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పంజాబ్‌లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
Advertisement