Congress Planning Religion Based Quota Says PM Modi At Karnataka Rally, Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ

Published Mon, Apr 29 2024 3:39 PM

Congress Planning Religion Based Quota Says PM Modi at Karnataka Rally

బెంగళూరు: లోక్‌సభ 2024 ఎన్నికల్లో విజయమే ప్రధానంగా జాతీయ పార్టీల కీలకనేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక (బాగల్‌కోట్‌) ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసం మాత్రమే అని, దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దానిని జరగనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు.

ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఇప్పుడు బీజేపీ వెంట ఉన్నందున మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ కాంగ్రెస్ ప్రతిపాదన అని చేసిందని ,మోదీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం SC / ST, OBCల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. మన రాజ్యాంగం మత ఆధారిత రిజర్వేషన్‌లను అంగీకరించదు.

నా దళిత, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ సోదర సోదరీమణులకు కాంగ్రెస్‌ ఉద్దేశాల గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. మతం ప్రాతిపదికన ఈ వ్యక్తులు తమ ఓటు బ్యాంకును సురక్షితంగా ఉంచుకునేందుకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇచ్చిన మీ హక్కును దోచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు అని మోదీ అన్నారు.

ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప, బీజేపీ అభ్యర్థులు, బాగల్‌కోట్, విజయపుర ఎంపీలు పిసి గడ్డిగౌడర్, రమేష్ జిగాజినాగి కూడా పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంపీలు బీజేపీకి చెందిన వారేనని మోదీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement