Breaking News

#Riyan Parag: 'అతడొక సంచలనం.. సూర్యకుమార్‌లా ఆడుతున్నాడు'

Published on Tue, 04/02/2024 - 19:16

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌  తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పరాగ్‌.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ శాంసన్‌, బట్లర్‌, జైశ్వాల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట పరాగ్‌ సత్తాచాటాడు. 

తన అద్బుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను పరాగ్‌ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న పరాగ్‌ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌.. 181 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరాగ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. పరాగ్‌ తన ఆట తీరుతో సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేస్తున్నడంటూ బాండ్‌ కొనియాడాడు.

"పరాగ్‌ అద్బుతమైన ఆటగాడు. అతడు తన ఆట తీరుతో సూర్యకుమార్‌ యాదవ్‌ను గుర్తు చేశాడు. సూర్య ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఈ తరహా ప్రదర్శనే చేసేవాడు. పరాగ్‌కు మంచి బ్యాటింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. అతడు కేవలం 22 ఏళ్ల వయస్సుకే అద్బుతమైన టాలెంట్‌ను సంపాందించుకున్నాడు. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈ ఏడాది సీజన్‌ ఆర​ంభానికి ముందు అతడు దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే అతడికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇచ్చాం. దేవ్‌దత్‌ పడిక్కల్‌ను వదులుకోవడంతో పరాగ్‌ ఆ స్ధానంలో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. 

అతడి నుంచి ఈ తరహా ప్రదర్శన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాము.రాజస్తాన్‌ అతడిపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ప్రతిఫలం పొందుతుంది. మిగిలిన సీజన్‌లో కూడా రియాన్‌ తన ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని" క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాండ్‌ పేర్కొన్నాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)