Breaking News

ఇండియన్‌ సూపర్‌ హీరోలకు సింగపూర్‌ అధ్యక్షుడు ఆహ్వానం

Published on Fri, 08/01/2025 - 19:10

సింగపూర్‌: సూపర్‌ హీరోలు అంటే ఎవరు?.. ప్రత్యేక సూట్లు వేసుకుని అతీత శక్తులతో అద్భుతమైన పనులు చేసినంత మాత్రానా అయిపోతారా?.. అలాంటివేం లేకపోయినా ఆపదలో ఒక నిండు ప్రాణం కాపాడిన సరిపోతుందని నిరూపించారు ఇక్కడ కొందరు. సింగపూర్‌ గడ్డపై జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

గత నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడుతుంది. వాస్తవానికి ఆ ప్రదేశం అండర్‌ గ్రౌండ్‌లో నీటి పైప్ లైన్‌ పగిలి ప్రమాదకరంగా మారింది. అందుకే ఓ కార్మికుడు వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తున్నాడు. 

అయినప్పటికీ ఓ కారు ప్రమాదానికి గురైంది. అదిగో అప్పుడే సింగపూర్‌లోని భారతీయ వలస కార్మికులు సూపర్‌ హీరోలుగా రంగలోకి దిగారు. నిమిషాల్లో ప్రమాదానికి గురైన కారును.. అందులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాల్ని కాపాడారు. ఆ దేశ అధ్యక్షుడితో శభాష్‌ అనిపించుకున్నారు.    



జూలై 26న సింగపూర్‌లోని తంజోంగ్ కాటాంగ్ రోడ్ వద్ద రోడ్డు వ్యవస్థల సమన్వయం కోసం 16 మీటర్ల లోతైన షాఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ  సమయంలో.. ఒక కాంక్రీట్ భాగం కూలిపోయింది. ఫలితంగా వాటర్‌ పైప్‌లైన్‌ పగిలి 3 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు అందులో పడిపోయింది. అందులో ఉన్న మహిళ ప్రమాదంలో చిక్కుకుంది.

ప్రమాదంతో అప్రమత్తమైన ఏడుగురు భారతీయ వలస కార్మికులు పిచ్చై ఉదయప్పన్ సుబ్బయ్య (సూపర్‌వైజర్‌),వెల్మురుగన్ ముత్తుస్వామి పూమాలై సరవణన్, గణేశన్ వీరసేకర్,బోస్ అజిత్‌కుమార్,నారాయణస్వామి మాయకృష్ణన్, సతపిల్లై రాజేంద్రన్‌లు నైలాన్ తాడు ఉపయోగించి మహిళను 3-5 నిమిషాల్లో సురక్షితంగా బయటకు లాగారు. అనంతరం,అచేతనంగా ఉన్న బాధితురాల్ని స్థానికంగా ఉన్న రాఫెల్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఏ మాత్రం సంకోచించకుండా మహిళ ప్రాణాల్ని కాపాడిన వలస కార్మికులకపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   

సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఈ సూపర్‌ హీరోలను ఆగస్టు 3న ఇస్తానా అధ్యక్షుడి భవనంలో భేటీ కానున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, మినిస్ట్రీ ఆఫ్ మాన్‌పవర్ ఏసీఐ అనే కాయిన్‌ను బహుకరించింది. ItsRainingRaincoats అనే చారిటీ  ఎస్‌జీడీ 72,241 (సింగపూర్ డాలర్స్‌) (భారత కరెన్సీలోరూ.44 లక్షలకుపైగా) విరాళాలు సేకరించింది. వారి కుటుంబాలకు అందించనుంది.  

ఈ సంఘటన వలస కార్మికుల హక్కులపై చర్చకు దారితీసింది. వారు ఎదుర్కొంటున్న తక్కువ జీతాలు, అనారోగ్య నివాసాలు, పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)