Breaking News

రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్‌!

Published on Mon, 04/29/2024 - 08:05

పొరుగు దేశం పాకిస్తాన్‌ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.

పాక్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్‌బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్‌ మద్దతు ఇచ్చినందుకు పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్‌మెంట్ (ఎస్‌బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.

గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్‌ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్‌ ప్రత్యేక సమావేశంలో పాక్‌ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.

తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు