Breaking News

కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!

Published on Mon, 01/13/2025 - 11:40

లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు  అమెరికాను అతలాకుతలం చేసింది.   కనీవినీ ఎరుగని ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.  16 మంది కనిపించకుండాపోయారు. సుమారు 50వేల ఎకరాలు  నాశనమైపోయాయి. 12వేల నిర్మాణాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్‌ మీడియా యూజర్లు,ఇతర దాతలు విరాళాలకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే..ఘోర విపత్తు మధ్య జనం అల్లాడి పోతుంటే.. కనీస మానవత్వం మరిచిన కేటుగాళ్లు తన వక్రబుద్ధి  చూపించిన  దారుణ ఘటనలు వార్తల్లో నిలిచాయి.

ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో  దోపీడీలకు తెగబడ్డారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడగా, మరి కొంతమందిని అరెస్ట్‌ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఆదివారం (జనవరి 12) కనీసం 29 మంది అరెస్టులు జరిగాయని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఒకరిని పట్టుకున్నట్టు  చెప్పారు.  25 అరెస్టులు ఈటన్ ఫైర్ ప్రాంతంలో జరగగా, మరో నాలుగు పాలిసాడ్స్ ఫైర్ ప్రాంతానికి సమీపంలో జరిగాయి.

ఇదీ చదవండి: లాస్ ఏంజెల్స్‌ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్‌డేట్‌ ఇదే!

ఈ నేపథ్యంలో భద్రతరీత్యా దోపిడీని అరికట్టడానికి ప్రభావిత ప్రాంతాలకు 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. సోమవారం  సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వరకు అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ మెక్‌డొనాల్డ్  వెల్లడించారు. 

మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్‌వుడ్‌లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం మరిన్ని అరెస్టులు జరిగాయని  కూడా అధికారులు వెల్లడించారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)