Breaking News

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నా జీవితాన్నే మార్చేసింది

Published on Mon, 07/27/2026 - 12:38

రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు జాన్ సీనా తన  జుట్టు మార్పిడి  (Hair Transplant) ప్రయాణం గురించి ఎప్పుడూ చాలా బహిరంగంగా మాట్లాడతారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ (San Diego Comic-Con) వేడుకలో పాల్గొన్న ఆయన, తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వివరాలను వెల్లడించారు. ఈ మార్పు తన రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీవితాన్నే మార్చేసిందని వెల్లడించారు. సిగ్గుతోనే, ఈ ప్రక్రియ గురించి పట్టించుకోలేదని లేదంటే పదేళ్ల క్రితమే చేయించుకుని ఉండేవాడినని తెలిపాడు. అంతే​కాదు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు.

'PEOPLE' మ్యాగజైన్‌తో మాట్లాడిన జాన్ సీనా ఇప్పటివరకు రెండుసార్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించు కున్నట్లు తెలిపారు. తన కొత్త హెయిర్‌స్టైల్ గురించి చెప్తూ, ఈ ప్రొసీజర్‌ చాలా బాగా జరిగిందని అన్నారు. ఎక్కువ జుట్టు పొందడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ జీవితాన్ని మార్చిన మార్పుకు కారణమైన తన వైద్యుడికి ధన్యవాదాలు తెలిపారు: ఎక్కువ జుట్టు కావాలనేది  టార్గెట్‌. దానికి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సరియైన మార్గం. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన డాక్టర్ కేన్ ఆండర్సన్‌ తన జీవితాన్నే పూర్తిగా మార్చే శారని చెప్పుకొచ్చారు.

రెండోసారి చికిత్స , అనుభవం
జార్జియాలోని 'ఆండర్సన్ సెంటర్ ఫర్ హెయిర్' వైద్యుల సేవలకు ఇంప్రెస్ అయిన సీనా, మొదటి సర్జరీ జరిగిన 15 నెలల తర్వాత మళ్లీ ఫాలో-అప్ కోసం వెళ్లినపుడు  తల పూర్తిగా షేవ్ చేస్తే జుట్టు మార్పిడిని మరింత వేగంగా చేయవచ్చని తెలిపారు. అలా తన తొలి ఆపరేషన్పదమూడున్నర గంటలు పట్టిందన్నారు. కానీ  రెండోది ఎనిమిది గంటల్లో పూర్తయిందనీ తన డాక్టర్‌పై పూర్తి నమ్మకం ఉందని,ఆయన చెప్పిన ప్రక్రియను నేను నమ్ముతున్నానని తెలిపారు.

జాన్ సీనా హెయిర్ జర్నీ 
FUE అనేది జుట్టును పునరుద్ధరించడానికి వ్యక్తిగత వెండ్రుకల ఫోలికల్స్‌ను వేరు చేసి నాటే ఒక ఆధునిక సర్జరీ పద్ధతి. జూన్ 2026లో జాన్ సీనా తన రెండో వింత 'ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్' (FUE) చికిత్స గురించి ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. దీంతోపాటు గతంలో 2024 చివరలో మొదటిసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. ఆగస్టు 2025లో పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, అభిమానులు,  ప్రేక్షకుల వల్లే తాను  జుట్టు మార్పడిపై  దృష్టి పెట్టానని చెప్పారు

తాను  బట్టతలను దాచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రేక్షకులు రింగ్ సైడ్ వద్ద 'ది బాల్డ్ జాన్ సీనా' అని బోర్డులు పట్టుకుని చూపించారని గుర్తు చేసుకున్నారు. దాంతో తాను రీసెర్చ్ చేసి, జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యం గురించి తెలుసుకునేలా అభిమానులే ప్రోత్సహించారని కూడా తెలిపారు. ప్రస్తుతం రెడ్-లైట్ థెరపీ, మినోక్సిడిల్ (Minoxidil), విటమిన్లు, ప్రత్యేకమైన షాంపూ , కండిషనర్ ఉపయోగిస్తున్నానని వెల్లడించారు.

అపోహలపై సీనా ఆవేదన
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంకోచం లేకపోయి ఉంటే తాను దశాబ్దం (10 ఏళ్ల) కిందటే ఈ చికిత్స చేయించుకునే వాడినని అన్నారు. సుమారు 70శాతం నుండి 80శాతం మంది పురుషులు జుట్టు రాలడం లేదా బట్టతల సమస్యతో బాధపడుతున్నారని, కాబట్టి దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని సీనా అభిప్రాయపడ్డారు.

ఎవరీ జాన్‌ సీనా
జాన్ ఫెలిక్స్ ఆంథోనీ సీనా రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్. మాజీ రాపర్. ప్రొఫెషనల్ రెజ్లింగ్ చరిత్రలో అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జాన్‌ సీనా నటుడు కూడా.2002లో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీనా కేవలం ఒకదశాబ్దంలోనే గ్లోబల్ సూపర్స్టార్‌గా ఎదిగారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) లో సూపర్ స్టార్‌గా అభిమానులను అలరించిన సీనా సినీ రంగంలోను రాణించారు. 30 పైగా సినిమాల్లో నటించారు. 24 సంవత్సరాల అద్భుతమైన కెరీర్‌లో 17సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించి, డిసెంబర్ 2025లో ఆయన పోటీల నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం WWEకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.

మేక్-ఎ-విష్ (Make-A-Wish) ఫౌండేషన్ ద్వారా వందలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోరికలను తీర్చి మానవతావాదిగా నిలిచారు. రెజ్లింగ్‌తో పాటునటనారంగం (హాలీవుడ్)లో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' (F9), 'ది సూసైడ్ స్క్వాడ్', 'పీస్‌మేకర్' వంటి ప్రముఖ చిత్రాలు, సిరీస్‌లలో నటించి నటుడిగానూ రాణించారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)