Breaking News

అమల్లోకి కొత్త చట్టం.. ఆఫీస్‌ అవర్స్‌ దాటిన తర్వాత విసిగిస్తే బాస్‌పై చర్యలే

Published on Fri, 08/23/2024 - 15:24

ఆఫీస్‌ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్‌ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్‌ పెండింగ్‌ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్‌ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్‌. ఆఫీస్‌ అవర్స్‌ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.

గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్‌మెంట్ (రైట్ టు డిస్‌కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో  ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.

పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్‌ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్‌ చేసి ఆఫీస్‌ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్‌ ఫ్రమ్‌ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్‌ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్‌తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో  ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్‌లు ఉన్నాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)