Breaking News

ఆఫీస్‌ స్పేస్‌కి అమెరికన్‌ సంస్థల దన్ను 

Published on Sun, 06/15/2025 - 05:30

న్యూఢిల్లీ: దేశీయంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అమెరికన్‌ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్‌ చ.అ. స్పేస్‌ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్‌స్పేస్‌ లీజింగ్‌లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

దీని ప్రకారం 2022–24 క్యాలెండర్‌ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్‌ సంస్థలు ప్రధానంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్‌గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్‌ నగరాల్లో ఆఫీస్‌ డిమాండ్‌కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి. 

ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్‌ సంస్థలకు భారత్‌ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్‌ఎల్‌ హెడ్‌ (ఆఫీస్‌ లీజింగ్, రిటైల్‌ సరీ్వసెస్‌), సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (కర్ణాటక, కేరళ) రాహుల్‌ ఆరోరా చెప్పారు. అమెరికన్‌ సంస్థలు తీసుకున్న ఆఫీస్‌ స్పేస్‌లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు.    
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)