Breaking News

అన్నా చెల్లెళ్ల దారుణ హత్య

Published on Sat, 10/07/2023 - 10:58

తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో అన్నా చెల్లెళ్లు దారుణంగా హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్, మనీషా దంపతులకు షక్షీమ్‌(6), ప్రజ్ఞాన్‌(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది నుంచి భర్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో దూరంగా ఉండేవారు. అయితే యువరాజ్‌ 4 రోజుల కిందట తిరుపతి కి చేరుకుని నగరంలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో బస చేశాడు.

ఇదే క్రమంలో భార్యకు ఫోన్‌ చేసి, తిరుపతి కొస్తే మాట్లాడుకుందామని చెప్పా డు. దీంతో మనీషా పిల్లలను తీసుకుని హైదరాబాద్‌ వర కు రైలులో వచ్చి, అక్కడి నుంచి తన అన్న హర్షవర్దన్‌తోపాటు విమానంలో తిరుపతికి చేరుకుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్‌ తన భార్య మనీషాతోపాటు ఆమె అన్న హర్షవర్ధన్‌(25) కూడా దారుణంగా కత్తితో పొడిచి, హత్య చేశాడు. అయితే హత్యకు  కారణాలు పలు కోణాల్లో వినిపిస్తున్నాయి.

వీరి మధ్య ఆస్తి తగాదాలున్నాయని, యువరాజును హత్య చేస్తే పెద్ద మొత్తంలో ఆస్తి వస్తుందని, అతడిని చంపడానికి  వారు తిరుగు తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే యువరాజ్‌ చంపి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. యువరాజ్‌ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలిసిందని సీఐ చెప్పారు. అయితే నిజాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి  తరలించామన్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)