Breaking News

Zero Shadow Day 2023: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు 

Published on Tue, 05/09/2023 - 07:38

సాక్షి, హైదరాబాద్‌:  విశ్వంలో వింతలు ఎన్నెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతం కానుంది. అది ‘నీడ లేని రోజు’ (జీరో షాడో డే). ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్‌ కర్కాటక రాశి–23.4నిఎస్‌ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కనిపించనుంది.

సూర్యుడు తలపైకి వచ్చిన తరువాత (మధ్యాహ్నం 12:12 నిమిషాలకు) దేని నీడా కనిపించదు. అక్షం వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్ర­మణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. హైదరాబాద్‌ నగర అక్షాంశం 17.3850(ఎన్‌)డిగ్రీల ప్రకారం ఇక్కడ నేడు మధ్యాహ్నం 12:12 నిమి షాలకు నీడను చూడలేం.  

బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శన... 
జీరో షాడో డేపైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయో గాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్‌ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12:12 నిమిషాలకు  అప్పటివరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటివద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)